NTV Telugu Site icon

Congress Leaders Protest: ఎంపీల సస్పెండ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన

Batti

Batti

Congress Leaders: పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్యం ఉందా.. నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుంది.. దేశాన్ని రక్షించాలి అని ఆలోచన బీజేపీకి లేదు.. 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? అని భట్టి విక్రమార్క అన్నారు.

Read Also: Naa Saami Ranga: థియేటర్ల వేటలో నా సామి రంగా!

ఇక, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీ నియంత్ర్యత్వ ధోరణి వ్యవహరిస్తుంది.. పార్లమెంట్ పై దాడి జరిగితే సమాధానం లేదు.. పార్లమెంట్ కి భద్రత ఇచ్చే పరిస్థితి ఎన్డీయేకి లేదు.. దేశానికి భద్రత ఎలా కల్పిస్తారు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారు.. ఎంపీల గొంత నొక్కుతూ సభ నుంచి సస్పెండ్ చేశారు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి.. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వంతో ధర్నా చౌక్ ని తీసేసింది.. హైకోర్టు ధర్నా చౌక్ కి అనుమతి ఇచ్చింది.. ప్రజలంతా నిరంకుషత్వ ప్రభుత్వాన్ని తొలగించారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Read Also: AP CID: లోకేష్‌ను అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నా చేస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. పార్లమెంట్ లో పొగ బాంబులు వేస్తే ప్రధాని మోడీ ఇంత వరకు సమాధానం చెప్పలేదు.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేశారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకూషత్వంగా వ్యవహరిస్తుంది అని ఆయన విమర్శలు గుప్పించారు.

Read Also: Telangana: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు..

బీజేపీ పార్టీ దేశంలో కుల మతాల పేరుతో ప్రజలను విచ్చిన్నం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజలను గాలికొదిలేశారు.. పార్లమెంట్ పై దాడి జరిగితే కనీసం స్పందించలేదు.. మీ హయాంలో దేశ ప్రజల స్థితిగతులు మారయా?.. దేశం అప్పుల కుప్పగా మారింది.. ఎంపీలను సస్పెండ్ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు చేస్తారు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది.. 2 నెలల సమయం ఉంది.. ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అన్నారు. మోడీ హయాంలో విధ్వంసాలు జరుగుతున్నాయి.. ప్రశాంతంగా ఉన్నా రాష్ట్రాలు కల్లోలం అవుతున్నాయి.. మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారు అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.