Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా తెలంగాణ నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Tour: తెలంగాణ నేతలు ఢిల్లీలో బిజీ షెడ్యూల్‌తో దూసుకెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరోవైపున భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరి పర్యటనలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కీలకంగా మారాయి.
Tollywood : యాంకర్ సుమ భర్త.. నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో నిర్వహించిన కులగణన, అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అధిష్టానంతో చర్చించనున్నారు. సాయంత్రం, ఎఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో తెలంగాణ కులగణన సర్వే ఎలా జరిగింది, ఎన్ని మంది ఉద్యోగులు పాల్గొన్నారు, ఏవిధమైన ప్రశ్నలు అడిగారు వంటి అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు పూర్తి వివరాలు ఇవ్వనున్నారు.
ఇక మరోవైపు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గోల్లపల్లి రామచంద్రరావు ఢిల్లీలో పర్యటన చేపట్టారు. ఆయన ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ముఖ్యంగా ఇటీవల బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వచ్చిన విభేదాల నేపథ్యం గురించి చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విభాగాల్లో తలెత్తిన అసంతృప్తి నివారణ, భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షాకు రిపోర్ట్ ఇవ్వనున్నారని సమాచారం.
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!