Site icon NTV Telugu

Congress First List: నేడే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా..

Congress

Congress

కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. గత నెల రోజులుగా అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రేపు మాపు అంటూ ఊరిస్తూ.. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించనుంది. సీఈసీ ( కేంద్ర ఎన్నికల కమిటీ ) సమావేశం ముగిసిన నేపథ్యంలో నేడు (ఆదివారం) ఏ టైంలోనైనా 58 మందితో కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల అవుతుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: Viral Video: అయ్యయ్యో.. మెట్లుంటే చూసుకుని ఎక్కొచ్చుగా.. ఇలా తెలియని ఎక్స్ లేటర్ ఎక్కి పడేకంటే?

ఇక, ఆ తర్వాత మరొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్‌ అధిష్టానం అనుకుంటుంది. అయితే, ఈనెల 18న ఆ జాబితా కూడా రిలీజ్ అవుతందని తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ నిన్న (శనివారం) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ 58 మందితో కూడిన తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం.

Read Also: Bigg Boss Telugu 7: రతిక, శుభ శ్రీ, దామిని రీఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాసూ.. యావర్ కు నాగ్ వార్నింగ్..

ఇందులో భాగంగానే ఖమ్మంలో కాంగ్రెస్-సీపీఐ సీట్లు ఖరారు అయింది. నేటి మధ్యాహ్నం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు. 1.మధిర భట్టి విక్రమార్క సిట్టింగ్, 2.ఖమ్మం తుమ్మల నాగేశ్వర రావు, 3.పాలేరు పొంగులేటి శ్రీనివసరెడ్డి, 4 భద్రాచలం పొదెం వీరయ్య సిట్టింగ్, 5. పినపాక పాయం వెంకటేశ్వర్లు, 6.ఇల్లందు కోరం కనకయ్య (జెడ్పీ చైర్మన్), 7. సత్తుపల్లి మట్టా రాఘమయి/ కొండూరు సుధాకర్, 8. వైరా రాందాస్ నాయక్/ విజయా బాయ్, 9. అశ్వరావు పేట.. తాటి వెంకటేశ్వర్లు రావు, జారే ఆదినారాయణ, సున్నం నాగమణి, ఇక, 10 .కొత్తగూడెం కూనంనేనీ సాంబ శివరావు.. సీపీఐకి కొత్తగూడెం నియోజకవర్గం కేటాయించారు.

Exit mobile version