Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!

Telangana Commercial Taxes Department

Telangana Commercial Taxes Department

Telangana Commercial Taxes Department Reorganized: తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) విభాగాల వారీగా కొత్త డివిజన్లు, సర్కిల్స్, జోన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం 19 డివిజన్లను ఏర్పాటు చేశారు. క్యూర్ పరిధిలో 19 ఎస్టీయూ (STU) డివిజన్లు, 78 సర్కిల్స్ ఏర్పాటు చేయగా.. ప్యూర్, రేర్ పరిధిలో 9 ఎస్టీయూలు, 43 సర్కిల్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో శాఖ పరిపాలన మరింత వికేంద్రీకృతం కానుంది. వాణిజ్య పన్నుల శాఖలో గతంలో 118 సర్కిల్స్ ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను 121కు పెంచారు. కొత్తగా మూడు సర్కిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొడంగల్‌ను కొత్త సర్కిల్‌గా చేర్చారు.

×
×
Ad

ఇప్పటివరకు నల్గొండ–మహబూబ్‌నగర్ ఒకే డివిజన్ పరిధిలో ఉండగా.. తాజా పునర్వ్యవస్థీకరణలో వాటిని వేరు చేశారు. మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఫ్యూచర్ సిటీ పేరుతో మరో కొత్త డివిజన్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కానుంది. అలాగే ఈ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు చేపట్టారు. మొత్తం 22 మంది జాయింట్ కమిషనర్లు (జేసీలు), 37 మంది డిప్యూటీ కమిషనర్లు (డీసీలు) బదిలీ అయ్యారు. అలాగే మల్టీజోన్-1 పరిధిలో 103 మంది కమర్షియల్ ట్యాక్స్ అధికారులు (సీటీవోలు), మల్టీజోన్-2 పరిధిలో 37 మంది సీటీవోలను బదిలీ చేశారు.