Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Commercial Taxes Department Reorganized: తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) విభాగాల వారీగా కొత్త డివిజన్లు, సర్కిల్స్, జోన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం 19 డివిజన్లను ఏర్పాటు చేశారు. క్యూర్ పరిధిలో 19 ఎస్టీయూ (STU) డివిజన్లు, 78 సర్కిల్స్ ఏర్పాటు చేయగా.. ప్యూర్, రేర్ పరిధిలో 9 ఎస్టీయూలు, 43 సర్కిల్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో శాఖ పరిపాలన మరింత వికేంద్రీకృతం కానుంది. వాణిజ్య పన్నుల శాఖలో గతంలో 118 సర్కిల్స్ ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను 121కు పెంచారు. కొత్తగా మూడు సర్కిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొడంగల్‌ను కొత్త సర్కిల్‌గా చేర్చారు.
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఇప్పటివరకు నల్గొండ–మహబూబ్‌నగర్ ఒకే డివిజన్ పరిధిలో ఉండగా.. తాజా పునర్వ్యవస్థీకరణలో వాటిని వేరు చేశారు. మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఫ్యూచర్ సిటీ పేరుతో మరో కొత్త డివిజన్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కానుంది. అలాగే ఈ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు చేపట్టారు. మొత్తం 22 మంది జాయింట్ కమిషనర్లు (జేసీలు), 37 మంది డిప్యూటీ కమిషనర్లు (డీసీలు) బదిలీ అయ్యారు. అలాగే మల్టీజోన్-1 పరిధిలో 103 మంది కమర్షియల్ ట్యాక్స్ అధికారులు (సీటీవోలు), మల్టీజోన్-2 పరిధిలో 37 మంది సీటీవోలను బదిలీ చేశారు.
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?