IND vs ENG: ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ సీఎం.. హాజరుకానున్న భారత క్రికెట్ దిగ్గజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCA President Jagan Mohan Rao on IND vs ENG 1st Test: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. కీలక సమరానికి సిద్ధమవుతోంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. హైదరాబాద్ ఉప్పల్‌ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జనవరి 25 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అంతేకాదు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ… ‘భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. అంతర్జాతీయ మ్యాచ్ చూడాలనుకునే సామాన్య ప్రజల కోసం టికెట్ ధరలు తగ్గించాం. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తాం. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికులకు ఉచిత ప్రవేశం ఉంటుంది’ అని తెలిపారు. ఈ మ్యాచ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు చెప్పారు. సీఎం లండన్ నుంచి రాగానే నేరుగా కలిసి మ్యాచ్‌కు హాజరవ్వాలని కోరుతామన్నారు.
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
Also Read: WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్‌కు ఇంగ్లండ్ సిరీస్ కీలకం!
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం జనవరి 23న జరుగుతుందని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ సహా మరికొందరు హాజరవుతారని చెప్పారు. హెచ్‌సీఏ తరఫున వారిని కలిసి తొలి టెస్ట్‌కు హాజరుకావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని జగన్ మోహన్ రావు చెప్పారు. ఈ టెస్ట్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు త్వరలో హైదరాబాద్‌కు రానున్నాయి.
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!