Site icon NTV Telugu

CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Telangana CM Revanth Reddy Delhi Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం ఢిల్లీ బయల్దేరారు. కాసేపటిక్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం.. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానంకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు వరంగల్‌లో ‘రైతు కృతజ్ఞత’ సమావేశానికి రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.

Also Read: Komatireddy Venkat Reddy: రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టాం: మంత్రి కోమటిరెడ్డి

ఈ సమావేశంలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ ఇద్దరు సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. భేటీ అనంతరం హైదరాబాద్ తిరిగిరానున్నారు. నేడు రైతు కృతజ్ఞత సభ తేదీ ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version