NTV Telugu Site icon

CM Revanth Reddy: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ.. ఎందుకో తెలుసా..?

Ap Tg

Ap Tg

CM Revanth Reddy: రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు. చంద్రబాబు చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తు్న్నట్లు ఆయన ఈరోజు లేటర్ రాశారు. ఈ నెల 6వ తేదీన చర్చించుకుందామన్న ఏపీ సీఎం ప్రతిపాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించారు. దీని ద్వారా చర్చలకు ఆంధ్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని… పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను తొందరలోనే పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం పేర్కొన్నారు.

Read Also: AyyannaPatrudu: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని కలిసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు..

ఇక, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో ఇద్దరం కలుద్దామని పేర్కొన్నారు. నిన్న మీరు పంపిన లేఖ అందింది.. దానిని చదివాను అని రేవంత్ తెలిపారు. మొదటగా ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించినందుకు ఎన్టీయే కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. స్వతంత్ర భారతంలో నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతికొద్ది మందిలో మీరు ఉన్నారని చంద్రబాబు నాయుడిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

0000