Trisha : తెలంగాణకు చెందిన అండర్-19 మహిళల క్రికెటర్ త్రిష గొంగడి అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను తన జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి త్రిష భవిష్యత్‌లో దేశం తరఫున మరింత పెద్ద స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసిన సీఎం, త్రిష గొంగడికి రూ. 1 కోటి నజరానా ప్రకటించారు.
Read Also: Hombale Films : ఆ సూపర్ హిట్ ప్రీక్వెల్ పై భారీగా ఖర్చుపెడుతోన్న నిర్మాణ సంస్థ
ఇతర క్రికెటర్లకు కూడా ఆర్థిక సహాయం
అండర్-19 వరల్డ్ కప్ జట్టు సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ ధృతి కేసరికి రూ. 10 లక్షలు, జట్టు హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ. 10 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా తోడ్పాటును అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: AAP vs BJP: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఆప్- బీజేపీ పార్టీల కార్యకర్తలు