Site icon NTV Telugu

Minister Sridhar Babu: మరోసారి దావోస్‌కు వెళ్తున్నాం.. భారీగా పెట్టుబడులు తెస్తాం..

Sridhar Babu

Sridhar Babu

Minister Sridhar Babu: ఈనెల 19న మరోసారి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల బృందం దావోస్‌కు వెళ్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంగళవారం నిర్వహించిన శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. మళ్ళీ పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటిసారి మెడికల్ టూరిజం తీసుకొచ్చాం.. త్రీ ట్రిలియన్ డాలర్లు ఏకానమి చేయాలనేది మా ఆలోచన, దృక్పథం అని పునరుద్ఘాటించారు. పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్ ఆఫ్ డూఇంగ్ తీసుకొచ్చామని తెలిపారు.

READ MORE: Maria Machado: అధికారం కోసం ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరపలేదు.. మచాడో ప్రకటన

గతంలో దావోస్ లో 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. “ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతాం అన్న వాటిలో 60 శాతం గ్రౌండ్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము.. 70 గ్లోబల్ కేపబులిటి సెంటర్స్ తీసుకొచ్చాం.. ఏరోస్పేస్ రంగంలో ఎక్కువ ఎక్స్ పోర్ట్ చేశాం.. 19న మరోసారి వరల్డ్ ఏకనామిక్ సమ్మిట్ కు వెళుతున్నాం, భారీగా పెట్టుబడులు తీసుకొస్తాం.” అని మంత్రి వెల్లడించారు.

READ MORE: Fidel Castro: 634సార్లు ప్రయత్నించి చంపలేకపోయారు.. అమెరికాను వణికించిన విప్లవ వీరుడు!

Exit mobile version