Site icon NTV Telugu

Caste Census : గ్రామాలలో కుల గణన సంబరాలు చేయాలి.. పీసీసీ ఆదేశం

Maheshkumargoud

Maheshkumargoud

Caste Census : గ్రామాలలో కుల గణన, వర్గీకరణ సంబరాలు చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆదేశించారు. నిన్న శాసనసభలో రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎన్నో ఏళ్ళు గా పెండింగ్ లో ఉన్న బిసి కులఘనన ను, ఎస్సీల వర్గీకరణ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. సమాజంలో రెండు ప్రధాన వర్గాలు బిసిలు, ఎస్సీ లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కులఘనన, వర్గీకరణ కార్యక్రమాలు కార్యాచరణకు సిద్ధమయ్యాయని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలలో, మండలాలలో, నియోజక వర్గాలలో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉప సంఘం చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి కు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు భారీ ఎత్తున నిర్వహించాలన్నారు. కార్యకర్తలు, నాయకులు, బీసీ, ఎస్సీ వర్గాలు కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యేయా ప్రోగ్రామ్ నిర్వహించాలని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు.

Maha Kumbh mela 2025: కుంభమేళాలో ప్రధాని మోడీ పుణ్య స్నానం

Exit mobile version