Site icon NTV Telugu

TG Cabinet: ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ

Tg Cabinet

Tg Cabinet

TG Cabinet: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైతుభరోసా కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి తర్వా రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విధివిధానాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

Exit mobile version