నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయ్యింది. నాలుగున్నర గంటలుగా క్యాబినెట్ సమావేశం కొనసాగింది. కాసేపటి క్రితమే తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రైతు భరోసా పంపిణీ, ఏపీ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి తదుపరి కార్యాచరణపై మంత్రివర్గం చర్చించింది. త్వరలో సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిఎల్పీ లో పార్టీ నేతలకు బనకచర్ల పై ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
Also Read:CM Chandrababu: డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా ఉంటుందో చూపించాం.. ఇదే జోరు కొనసాగిద్దాం..
ముందు ఏపీ తో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్ అలైన్మెంట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా రైతు నేస్తం సభ నిర్వహించాలని నిర్ణయించింది. నియోజక వర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించింది. సచివాలయం దగ్గర జరిగే సభకు మంత్రులు హాజరుకావాలని నిర్ణయం.. 2 వేల మందితో సభ నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
