తెలంగాణ కేబినెట్ పలు కార్పొరేషన్లకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పామని.. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ, మున్నూరు కాపు, పెరిక, గంగపుత్ర, పద్మశాలి కార్పొరేషన్.. ఏబీసీలకు కార్పొరేషన్ వైశ్య, రెడ్డి కార్పొరేషన్, మాల, మాదిగ కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
Bihar: పెళ్లి వీడియో తీసేందుకు వచ్చి.. పెళ్లికొడుకు చెల్లిని లేపుకుపోయిన వీడియోగ్రాఫర్..
మంత్రి మండలి ఆమోదించిన కార్పొరేషన్లు
1.ముదిరాజ్ కార్పోరేషన్
2.యాదవ కర్మ కార్పోరేషన్
3.మున్నూరు కాపు కార్పోరేషన్
4.పద్మశాలి కార్పోరేషన్
5.పేరిక (పురగరి క్షత్రియ ) కార్పోరేషన్
6. లింగాయత్ కార్పోరేషన్
7. మేర కార్పోరేషన్
8. గంగపుత్ర కార్పోరేషన్
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు
9. ఈబీసీ ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
10. ఆర్య వైశ్య కార్పోరేషన్
11. రెడ్డి కార్పోరేషన్
12. మాదిగ ,మాదిగ ఉప కులాల కార్పోరేషన్
13. మాల ,మాల ఉప కులాల కార్పోరేషన్
మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు
14.ఆదివాసీ కార్పోరేషన్ (కొమురం భీం)
15.సంత్ సేవాలాల్ లంబాడీ కార్పోరేషన్
16.ఏకలవ్య కార్పోరేషన్