Site icon NTV Telugu

Telangana Cabinet: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు!

Gaddam Vivek, Vakiti Srihari, Adluri Laxman

Gaddam Vivek, Vakiti Srihari, Adluri Laxman

తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్ శాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు.. అడ్లూరు లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు భేటీ అయ్యారు.

Also Read: Dil Raju: నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్!

జూన్ 8న సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్‌‌ను పునర్వ్యవస్థీకరించారు. కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ (చెన్నూరు), వాకిటి శ్రీహరి (మక్తల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పుడు వారికి శాఖలు కేటాయించలేదు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రులకు శాఖ కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈరోజు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా.. సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు. ప్రస్తుతం క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కి చేరింది.

Exit mobile version