తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తొలి బడ్జెట్ ను ఇవాళ ప్రవేశ పెట్టనుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాగా, మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ఇదే.. సుమారు 2.75 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
-
జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతం..
అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం..
-
నంది అవార్డు పేరు మార్పు..
నంది అవార్డును గద్దర్ అవార్డు పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందజేస్తాం.. ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు మేమిచ్చే నివాళి..
-
ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ..
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి కట్టుబడి ఉన్నాం.. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం రాష్ట్రానికి శాపంగా మారింది.. రూ. లక్షల కోట్ల ఖర్చుతో అవినీతి ఎంతో తేల్చాల్సి ఉంది.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచాణ జరిపిస్తాం.. కృష్ణా, గోదావరి జలాల్లో నీటి కేటాయింపులపై రాజీపడం..
-
త్వరలోనే స్కాలర్ షిప్ లు..
గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయలేదు.. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటుగా.. స్కాలర్ షిప్ లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.. తెలంగాణలో ఐటీఐ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు వందశాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తాం..
-
త్వరలో జ్యాబ్ క్యాలెండర్
జ్యాబ్ క్వాలెండర్ ను తయారు చేస్తున్నాం.. 15 వేల పోలీస్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ కు అదనంగా 64 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాం.. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా..
-
కొత్తగా నర్సింగ్ ఆఫీసర్ల నియామకం..
అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం.. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం..
-
ఇళ్లు కట్టుకునే వారికి రూ. 5 లక్షలు..
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం- భట్టి విక్రమార్క..
-
అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్..
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యం.. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు చేయబోతున్నాం.. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా ధ్వేయం..
-
రాష్ట్ర చిహ్నాంలో మార్పులు..
రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం.. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం.. వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశాం..
-
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నాం.. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశాం..
-
ధరణి వల్లే అన్ని సమస్యలు..
ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారింది.. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారు..
-
త్వరలో మెగా డీఎస్సీ..
టీఎస్పీఎస్సీకి రూ. 40 కోట్లు.. త్వరలో మెగా డీఎస్సీ ఉంటుంది..
-
గతంలో నకిలీ విత్తనాల సమస్యలు..
గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేది.. నకిలీ విత్తనాలతో మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..
-
వారికి రైతు బంధు కట్..
రైతుబంధుతో పెట్టుబడిదారులు, అనర్హులు లాభపడ్డారు.. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారు..
-
అర్హులకు రైతు బంధు..
అర్హులకే రైతు బంధు ఇస్తాం.. రైతు బంధు నిబంధనలు పున: సమీక్ష చేస్తాం.. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నాం.. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తాం..
-
త్వరలోనే గ్యాస్, ఉచిత కరెంట్
రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తాం..
-
ఇందిరమ్మ ఇళ్ల పథకం..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3.500 ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు..
-
ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు..
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ. 1000 కోట్లు.. ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు..
-
విద్యకు ప్రాధాన్యత..
తెలంగాణలో పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు.. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు..
-
రైతు రుణమాపీనూ త్వరలోనే కార్యాచరణ..
రైతుల రూ. 2 లక్షల రుణమాపీపై త్వరలోనే కార్యాచరణ.. విధివిధానాలు ఖరారు చేయబోతున్నాం- భట్టి విక్రమార్క
-
కేటాయింపులు..
బీసీ సంక్షేమం రూ. 8000 కోట్లు.. విద్య రంగానికి రూ. 21, 389 కోట్లు.. విద్యుత్-గృహ జ్యోతి పథకానికి రూ. 2, 418 కోట్లు.. విద్యుత్ సంస్థలకు రూ. 16, 825 కోట్లు.. గృహ నిర్మాణానికి రూ. 7,740 కోట్లు.. నీటి పారుదలశాఖకు రూ. 28, 024 కోట్లు..
-
ద్రవ్యలోటు
ద్రవ్యలోటు రూ. 32,557 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 5, 944 కోట్లు.. వ్యవసాయశాఖకు రూ. 19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ. 1,250 కోట్లు.. ఎస్సీ సంక్షేమం రూ. 21, 874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ. 13, 013 కోట్లు.. మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2, 262 కోట్లు, వైద్య రంగానికి రూ. 11, 500 కోట్లు..
-
కేటాయింపుల అంచనా..
పంచాయతీరాజ్ శాఖకు రూ. 40, 080 కోట్లు.. మున్సిపల్ శాఖకు రూ. 11,632 కోట్లు..
-
కేటాయింపులు..
పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు కేటాయింపు.. ఐటీశాఖకు రూ. 774 కోట్లు కేటాయింపు.. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2 లక్షల 75 వేల 891 కోట్లు.. ఆరు గ్యారంటీల కోసం రూ. 53 వేల 196 కోట్ల అంచనా
-
ఆర్థిక ఇబ్బందులున్నాయి..
ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీలు నెరవేరుస్తున్నాం..
-
ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం..
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం..
-
సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం..
అందరి కోసం మనమందరం అనే స్పూర్తితో మందుకెళ్తున్నాం.. తెలంగాణ సమాజం మార్పును కోరుకుంది.. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం.. మాది ప్రజల ప్రభుత్వం- భట్టి విక్రమార్క
-
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి
మండలిలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న అసెంబ్లీ వ్యవహరాల మంత్రి శ్రీధర్ బాబు
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్..
శాసనసభలో రూ. 2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క..
-
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
-
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరం..
నేటి అసెంబ్లీ సమావేశానికి కేసిఆర్ దూరం..
-
స్పీకర్ కు బడ్జెట్ పత్రాలు అందించిన మంత్రులు
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి బడ్జెట్ పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు
-
కౌన్సిల్ కి మంత్రి శ్రీధర్ బాబు..
కౌన్సిల్ కి బయలు దేరిన శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. కౌన్సిల్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న శ్రీధర్ బాబు
-
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్‌కు ఆహ్వానం..
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం.. కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌కు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి
-
బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి..
బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమవుతున్నాం..
-
తెలంగాణ బడ్జెట్ కేబినెట్ ఆమోదం..
తెలంగాణ బడ్జెట్ 2.75 లక్షల కోట్లకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.. బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్ రెడ్డికి అందించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలు అందజేసిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు.. ఈనెల 12వ తేదీన బడ్జెట్ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్.. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలను సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనున్నారు.