Telangana Budget 2026: గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు..!

Telangana Budget 2026

Telangana Budget 2026

Telangana Budget 2026: “మేం పాలకులు కాదు, ప్రజల సేవకులం” అనే నినాదంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కోసం కొత్తగా 2 లక్షల చేయూత పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి, త్వరలోనే ఈ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. దీని కోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించారు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 1,45,590 కోట్లు కేటాయించింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇవే..

Redmi 15A 5G: 6300mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలతో.. రెడ్‌మీ 15A 5G రిలీజ్ డేట్ ఫిక్స్

* ఆరు గ్యారంటీలు: రూ. 50,713 కోట్లు

* రైతు భరోసా: రూ. 18,000 కోట్లు

* చేయూత పెన్షన్లు: రూ. 14,861 కోట్లు

* ఇందిరమ్మ ఇండ్లు: రూ. 5,500 కోట్లు

* యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్: రూ. 5,000 కోట్లు

* మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ప్రయాణం): రూ. 4,308 కోట్లు

* సన్నవడ్ల బోనస్: రూ. 3,500 కోట్లు

* బియ్యం సబ్సిడీ: రూ. 3,000 కోట్లు

* గృహ జ్యోతి (ఉచిత విద్యుత్): రూ. 2,080 కోట్లు

* ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి: రూ. 1,000 కోట్లు

UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

ఇంకా విద్యార్థుల డైట్ ఛార్జీల కోసం రూ. 2,170 కోట్లు, స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 4,343 కోట్లు కేటాయించి విద్యా రంగానికి పెద్దపీట వేశారు. అలాగే, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ. 1,143 కోట్లు, ఉద్యోగుల హెల్త్ స్కీం కోసం రూ. 1,056 కోట్లు కేటాయించారు. మూసి నది పునరుజ్జీవనం కోసం ప్రాథమికంగా రూ. 1,500 కోట్లు కేటాయింపులు జరిగాయి.