ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు. ఈ ఇంటర్నేషనల్ లవ్ మ్యారేజ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read:Kasibugga Stampede: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు..
తిమ్మాపూర్‌కు చెందిన చైతన్య కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఫ్రాన్స్ యువతి సాన్వితో పరిచయం ఏర్పడింది. ఆమె అసలు పేరు ఇమేన్ బెన్. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబంలో తెలియజేశారు. ఇరు కుటుంబాల అంగీకారంతో, హిందూ సంప్రదాయాల ప్రకారం చైతన్య, సాన్విల వివాహం ఘనంగా జరిగింది.
Also Read:Kasibugga Stampede: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు..
ప్యారిస్ నుంచి వధువు తల్లిదండ్రులు బెన్, నేద్ర బెన్ స్వయంగా వచ్చి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి, నాజూకైన చీరలో తెలుగు వధువు లుక్‌లో మెరిసిపోయిన సాన్వి అందరినీ ఆకట్టుకుంది. బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరైన ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాగా గతంలో కూడా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల యువతులను తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
