ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు.…