Site icon NTV Telugu

Telangana BJP : ఈనెల 22న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

Bandi Sanjay

Bandi Sanjay

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈనెల 22న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన జరగనున్నాయి. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, బీజేపీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివ ప్రకాష్ జీ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మతి డి కె అరుణ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేపీ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్ తదితరులు పాల్గొంటారు.

Also Read : V.C Sajjanar : త్వరలో మరో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోబీజేపీజాతీయ నాయకులు, బీజేపీజాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, బీజేపీరాష్ట్ర పదాధికారులు, బీజేపీరాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీజిల్లా అధ్యక్షులు, బీజేపీ జిల్లా ఇన్చార్జులు తదితరులు పాల్గొంటారు. అదేవిధంగా ఈనెల 23, 24 తేదీలలో జిల్లా కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 25, 26 తేదీలలో మండల కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయని తెలిపారు.

Also Read :Clashes in TDP : ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ వర్గీయుల దాడీ

Exit mobile version