NTV Telugu Site icon

BJP Manifesto: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలు ఇవే..

Bjp Manifesto

Bjp Manifesto

BJP Manifesto: ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేశారు. 10 అంశాల కార్యాచరణను బీజేపీ ప్రకటింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్నారు. బీసీ అభ్యర్థినే సీఎంను చేస్తామని ప్రకటించారు.

Also Read: Amit Shah : మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగింది

బీజేపీ కీలక హామీలు ఇలా ఉన్నాయి..

*ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించడం ద్వారా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గింపు.

*ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన ‘మీభూమి’ వ్యవస్థ.

*ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు.

*ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారతను కల్పించేలా ఎస్సీ వర్గీకరణ చేయడంలో సహకారం.

*రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం. తద్వారా అందరికీ ఇల్లు, ఇంటి పట్టాలు అందజేత

*అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు.

*రాష్ట్రంలోని రైతుల ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ (ఎకరానికి రూ.18వేలు)తోపాటుగా.. చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రూ.2,500 ఇన్‌పుట్‌ సబ్సిడీ

*ప్రధానమంత్రి పంటబీమా పథకం ద్వారా రైతులకు ఉచిత పంటబీమా

*వరికి రూ.3100 మద్దతు ధర.. ఆసక్తి గల రైతులకు దేశీ ఆవులను ఉచితంగా అందజేత

*పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌..

*ప్రధానమంత్రి ప్రకటించిన జాతీయ పసుపుబోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని డెవలప్‌మెంట్

*స్వయం సహాయక బృందాలకు నామమాత్రపు 1% వడ్డీకే రుణాలు

*మహిళా రైతులకు మద్దతు, సహకారం అందించేందుకు మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు

*మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

*యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తరహాలో.. గ్రూప్-1, గ్రూప్-2 సహా.. TSPSC రిక్రూట్మెంట్ పరీక్షలను 6 నెలలకోసారి పారదర్శకంగా నిర్వహణ

*EWS కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ

*అర్హత కలిగిన కుటుంబాలకు.. ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ.

*ఆర్థికంగా వెనుకబాటుకు గురైన కుటుంబాలకు ఏడాదికోసారి ఉచిత వైద్య పరీక్షలు.

*నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

*రైతులకు లబ్ధి చేకూర్చేలా.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమీక్ష

*కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టులనిర్మాణం.

*సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీయింబర్స్మెంట్

*సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహణ.

*బైరాన్ పల్లి, పరకాల ఊచకోతను స్మరించుకుంటూ.. ఆగస్టు 27న ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహణ.

*సమ్మక్క-సారమ్మ మేడారం జాతర జాతీయస్థాయిలో నిర్వహణ

*వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర

*ఉమ్మడి పౌరస్మృతికోసం కమిటీ ఏర్పాటు.