Site icon NTV Telugu

Uttam Kumar Reddy : బీసీ జనాభా 46.25 శాతం.. సామాజిక న్యాయం కోసమే సర్వే

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రవ్యాప్త కులగణన సర్వే నివేదికను ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత అంశాలను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టింది. దాదాపు 50 రోజులపాటు ఈ సర్వే నిరంతరంగా కొనసాగింది.

Perfetto EV Scooter: మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 160KMరేంజ్!

అయితే.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి తెలంగాణ కులగణన సర్వే ఓ దిక్సూచి అని ఆయన అన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సర్వే పూర్తి చేశామని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఏ వర్గం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని ఆయన పేర్కొన్నారు. బీసీ జనాభా 46.25 శాతమని ఉన్నట్లు ఆయన తెలిపారు. సామాజిక న్యాయం కోసమే సర్వే అని మంత్రి ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

Gadikota Srikanth Reddy: సీఎం పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది..

బీసీ జనాభా లెక్కించాలనేది రాహుల్‌ కోరిక అని, దేశంలో ఇలంటి సర్వే ఎక్కడా ఎప్పుడూ జరగలేదన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌. వెనుకబడ్డ తరగతులకు న్యాయం చేయాలనేది మా ఆకాంక్ష అని ఆయన తెలిపారు. తెలంగాణ జనాభా 3 కోట్ల 70 లక్షల మంది అని, రాష్ట్రవ్యాప్తంగా 96.9 శాతం మంది సర్వేలో పాల్గొన్నారన్నారు. 3 కోట్ల 54 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారని,, 3.1 శాతం మంది సర్వేకు అందుబాటులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. అయితే.. నివేదక ప్రకారం.. ఎస్సీలు 17.43 శాతమని, ఎస్టీలు 10.45 శాతమని, ముస్లింలు 12.56 శాతం అని పేర్కొన్నారు.

సర్వేలో లక్షా 3389 మంది సిబ్బంది పాల్గొన్నారని, దేశంలోనే ఈ సర్వే ఒక చరిత్ర సృష్టించిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 4న కేబినెట్‌ సమావేశం ముందుకు సర్వే రిపోర్ట్‌ వస్తుందని, ఈనెల 4నే శాసనసభలో కులగణన నివేదిక ప్రవేశపెట్టి చర్చిస్తామన్నారు. కులగణన జరగకుండా తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు.

Exit mobile version