Bars Draw : తెలంగాణ రాష్ట్రంలో 28 కొత్త బార్లకు గాను ఈరోజు ఆబ్కారీ శాఖ లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. ఈ లాటరీ ప్రక్రియ శుక్రవారం నార్సింగ్‌లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ నేతృత్వంలో నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని నాలుగు బార్లకు మరో 148 దరఖాస్తులు అందాయి. మొత్తం 28 బార్లకు 3,668 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
Lakshmi Narasimha Swamy Temple : ఒక్క దర్శనంతో సమస్యలన్నీ దూరం..
ఈ లాటరీ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రూ.36.68 కోట్ల ఆదాయం లభించింది. లాటరీలో హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులే ఎక్కువగా విజయవంతం అయినట్టు తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థులు రెండు బార్లకు దరఖాస్తు చేయగా, ఒక్క దానికి ఎంపిక కావడం గమనార్హం. మరోవైపు, 148 దరఖాస్తులు చేసిన వ్యక్తికి కేవలం ఒక్క బార్ మాత్రమే దక్కడం విశేషం. కార్యక్రమానికి ముందు అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించినవారికి రెండు నిమిషాల మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. కార్యక్రమం మొత్తం సజావుగా, పారదర్శకంగా ముగిసిందని అధికారులు తెలిపారు.
Plane Crash: ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైద్య విద్యార్థి..
