Site icon NTV Telugu

Telangana Bandh: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్.. విద్యా సంస్థలకు సెలవు..!

Telangana Bandh Today

Telangana Bandh Today

Telangana Bandh Today: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బంద్‌ ఫర్‌ జస్టిస్‌ పేరుతో నేడు బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చారు. బీసీ సంఘాల జేఏసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంద్ లో పాల్గోనున్నారు. మండల, జిల్లా స్థాయిలో బంద్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చింది.

READ MORE: Kiran Abbavaram: ఎథిక్స్ లేవా.. జర్నలిస్ట్ ప్రశ్నకు కిరణ్ అపవరం సమాధానమిదే?

మరోవైపు.. ఈ రోజు ఉదయం రాజేంద్రనగర్ బస్ డిపో ముందు బీసీ నాయకులు బైటాయించారు. ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వకుండా బీసీ ఐక్య కులాల నాయకులు అడ్డుకున్నారు. బస్సు డిపో ముందు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులు బయటకు రానివ్వకుండా నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలకు మేనేజ్‌మెంట్‌లు సెలవులు ప్రకటించాయి.

READ MORE: Naga Chaitanya : 9వ క్లాస్ లోనే అమ్మాయికి ముద్దు ఇచ్చా.. నాగచైతన్య మామూలోడు కాదుగా..

Exit mobile version