Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Auto, Cab & School Van Strike: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్ కానున్నాయి. రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా, దాదాపు 18 రవాణా సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని, దీనివల్ల లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ ద్వారా రవాణా సంఘాల నేతలు ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను ఉంచారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ. 12 వేల ఆర్థిక సహాయం అందించాలని, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల భద్రత కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌లలో అనుమతులు లేకుండా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలని, గిగ్ వర్కర్స్ రక్షణ కోసం ‘అగ్రిగేటర్ పాలసీ’ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్ల భారంతో నలిగిపోతున్న డ్రైవర్లను ఆదుకునేందుకు పాత చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని, నిలిపివేసిన ఆటో త్రీవీలర్ లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!