Telangana Assembly: ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Assembly

Assembly

Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ వివిధ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని ధీటుగా తాము కూడా ప్రజంటేషన్‌ ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడీవేడిగా కొనసాగే ఛాన్స్ ఉంది.

Read Also: Russia Ukraine War: 3.83లక్షల మందిని పొట్టన పెట్టుకున్న రష్యా

×
×
Ad

అయితే, గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. తాజాగా మూడు రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులు నిన్న (మంగళవారం) ఓ ప్రకటన రిలీజ్ చేశారు.