NTV Telugu Site icon

Telangana Assembly Sessions 2024: తెలంగాణ ప్రజలకు నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే దానం

Mla Danam Nagender

Mla Danam Nagender

MLA Danam Nagender Comments on Union Minister Nirmala Sitharaman: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. శాసన సభలో క్వశ్చన్‌ అవర్‌ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం బీఏసీ సమావేశ నిర్ణయాలను సీఎం రేవంత్‌ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ 2024పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Also Read: Telangana Assembly Session 2024: కేంద్ర బడ్జెట్‌పై చర్చ.. శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు ఇవే!

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ… ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. బీజేపీ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణాలో తిరుగుతారు. మూసి నది అభివృద్ధి కోసం సీఎం మోడీకి విజ్ఞప్తి పత్రం ఇస్తే పట్టించుకోలేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణలో తిరగనియ్యం. పది ఏళ్ల నుండి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉండటం దరదుష్టకరం. తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలి. బడ్జెట్‌లో తెలంగాణను ఎక్కడ ఉచ్చరించలేదు’ అని అన్నారు.