NTV Telugu Site icon

TG Assembly Sessions: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. ప్రభుత్వ ఎజెండా రిలీజ్

Tg Assembly

Tg Assembly

TG Assembly Sessions: సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడవ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసింది. అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహా చార్యులు ప్రకటించిన ఎజెండా ప్రకారం, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేశారు.

Kandula Durgesh: కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరం..

సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి మృతిపై సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఆయన చేసిన కృషిని సభలో ప్రస్తావించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ సభ్యులు కూడా మాజీ ప్రధానమంత్రిపై తమ సంతాపాన్ని తెలియజేస్తారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తారు.

Show comments