తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమైంది. గతానికి భిన్నంగా ఈసారి ఓట్ల లెక్కింపలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి అరగంటలో పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ సాగుతుంది. ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తికాగానే, ఫలితాన్ని ధ్రువీకరణ కోసం పంపిస్తారు. తర్వాత ఆర్వో ఆధ్వర్యంలో రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. తెలంగాణ వ్యాప్తంగా 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. 131 టేబుళ్లల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
Read Also: Election Results 2023 Live : ఎవరి ధీమా వారితే.. గెలుపు మాదే అంటున్న పార్టీలు
అయితే, ప్రతి 500 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 131 టేబుళ్ల దగ్గర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేయాలని నిర్ణయించారు. పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తున్నారు. పార్టీల వారీగా వచ్చిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో ధృవీకరిస్తున్నారు.