NTV Telugu Site icon

Mahesh Kumar Goud: అంబేద్కర్ మాకు దేవుడు లెక్క.. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలి: పీసీసీ చీఫ్‌

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్ తమకు దేవుడు లెక్క అని, అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్‌ డిమాండ్‌ చేశారు.

Also Read: Komatireddy vs Harish Rao: డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాడీవేడి సంభాషణ!

రాజ్యాంగ వ్యతిరేఖి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నినాదాలు చేసింది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… ‘మేము దేవుళ్లను ఆరాధిస్తాం. డా.బీఆర్ అంబేద్కర్ కూడా మాకు దేవుడు లెక్క. అంబేడ్కర్‌పై చేసిన వాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలు అగ్రవర్ణాల పోకడను గుర్తు చేసేలా ఉన్నాయి. అమిత్ షాను బర్థరఫ్ చేస్తే ప్రజల మనసుకు కలిగిన గాయానికి కొంత రిలీఫ్ కలిగినట్లు ఉంటుంది. వెంటనే ప్రధాని మోడీ స్పందించి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు.