Weather Updates : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం వాతావరణంలో కీలక మార్పులకు దారి తీస్తోంది. దీని ప్రభావంతో రుతుపవనాలు త్వరితంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే 2–3 రోజుల్లో దక్షిణ భారతదేశానికి పూర్తిస్థాయిలో రుతుపవనాలు వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉపరిత ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయి. వాతావరణ శాఖ ఈ రోజు రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షం ముప్పు అధికంగా ఉండే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Indian Envoy: ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందే!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన
ఇక ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పొలాల్లో పని చేస్తున్న రైతులు, ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపరిత ఆవర్తనం తీవ్రత పెరిగే పరిస్థితుల్లో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. విద్యుత్ విఘ్నాలు, నీటి నిల్వలు పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
