NTV Telugu Site icon

Teja Sajja: తేజా సెలెక్షన్ మాములుగా లేదుగా.. కొత్త సినిమా హీరోయిన్ ఇదిగో..

Tejaaaa

Tejaaaa

తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతంలో వచ్చిన సినిమాలు కేవలం సక్సెస్ అయ్యాయి.. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం హిట్ అవ్వడమే కాదు.. భారీ కలెక్షన్ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరకున్నారు..అంతేకాదు హీరోయిన్ ఎవరనే దానిపై చర్చలు జరిగాయి.. ఇప్పుడు హీరోయిన్ ఎవరనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది..

హీరో తేజ తన తరువాతి సినిమాను కార్తీక్ ఘట్టమనేనితో చేస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ అమ్మడు ఢిల్లీకి చెందిన మోడల్.. తెలుగులో ఇప్పటివరకూ రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, హాయ్ నాన్న సినిమాల్లో నటించింది.. ఈ అమ్మడు ఇప్పుడు తేజా కు జోడిగా నటిస్తుంది..

రితికా నాయక్‌ తేజకి జోడిగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.. ఈ సినిమా తరువాత తేజా జై హనుమాన్ సినిమా లో నటించనున్నారు..

Show comments