‘మిరాయ్’ చిత్రంకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి గుండెల్లో పెట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు హీరో తేజ సజ్జా. అభిమానుల సపోర్ట్ వల్లే తాను సినిమాలు చేయగలుగుతున్నా అని, మీవల్లే ఇక్కడ ఉండగలుగుతున్నా అని అన్నారు. సినిమా చూసిన ఆడియన్స్ సపరేట్‌గా రీల్స్ చేస్తూ.. మిరాయ్ సినిమా గురించి ప్రమోట్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందన్నారు. మంచు మనోజ్ గారు ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. కుర్రాళ్లని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే గోల్డెన్ హార్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి థాంక్యూ చెప్పారు. సినిమా బిగినింగ్‌లో ప్రభాస్ గారు కథని నరేట్ చేయడం వల్లే సినిమాకి మంచి వెయిటేజ్ వచ్చిందని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.
‘ఈ సినిమాని మీ గుండెల్లో పెట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి పేరుపేరునా ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నా, ఇక్కడ ఉండగలుగుతున్నా. ఈ సినిమాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ సపరేట్‌గా రీల్స్ చేస్తూ ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తుంటే ఆనందంగా అనిపించింది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. డైరెక్టర్ కార్తీక్ గారు, నిర్మాత విశ్వప్రసాద్ గారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది. వారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. డైరెక్టర్ కార్తీక్ ఉన్నాడు కాబట్టే.. ఈ సినిమా ఉంది. ఏ సినిమా అయినా డైరెక్టర్తోనే మొదలవుతుంది. మా వెనుక ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా ఒక పిల్లర్ లాగా నిలబడ్డారు నిర్మాత గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనోజ్ గారికి థాంక్యూ సో మచ్. ఆయన ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. రితికాకి థాంక్యూ. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు ట్రావెల్ అయింది’ అని మిరాయ్ బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్లో తేజ సజ్జా అన్నారు.
Also Read: Manchu Manoj: 12 ఏళ్ల తర్వాత సక్సెస్.. కలలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్!
‘హరి గౌరా మ్యూజిక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కోసం తను ఎంతో ప్యాషన్ తో వర్క్ చేశాడు. మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వలన సినిమా మరో స్థాయికి వెళ్ళింది. రానా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. హనుమాన్ సినిమాకి ఆయన నాకు సపోర్ట్ చేసిన విధానం మర్చిపోలేను. కంటెంట్ చూసి సపోర్ట్ చేస్తానని వచ్చారు. ఈ సినిమా చూసి కూడా ఏదైనా చేస్తానని ముందుకు వచ్చారు. నిజానికి ఆయనకి ఏ లాభం లేకపోయినా మంచి సినిమా కోసం ముందుకు వచ్చారు. టీమ్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేయడం వల్లే ఈ విజయం వచ్చింది. సినిమా విఎఫ్ఎక్స్ గురించి అందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు. జగపతి బాబు గారు, శ్రీయ గారు, జయరాం గారు చాలా గొప్ప నటులు. మా పాషన్ చూసి మాతో ట్రావెల్ అయ్యారు, చాలా సపోర్ట్ చేశారు. వారందరికీ చాలా చాలా థాంక్స్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మిరాయ్ అందరికీ నచ్చే సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయండి’ అని తేజ సజ్జా చెప్పారు.
