Mirai : టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతేడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. భారీ కలెక్షన్ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే భారీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు.. హీరో తేజ తన తరువాతి సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆయన గతంలో రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Read Also:Starbucks : ఏం కొనకపోతే స్టార్‌బక్స్ లోకి అడుగుకూడా పెట్టలేరు.. కంపెనీ సంచలన నిర్ణయం
Started flying since last Sankranthi, and it’s still continuing with your love🤗
Wishing you all a vibrant Makara Sankranti ❤️
Let’s rise & fly like kites in the sky!#Mirai #HappySankranti pic.twitter.com/ifw9X97sW9— Teja Sajja (@tejasajja123) January 15, 2025
క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, దుల్కర్ లాంటి హీరోలు కూడా కనిపించనున్నారు. దుల్కర్ అయితే ఓ యోధుడి పాత్రలో పాత్రలో మెరువనున్నాడు.. మంత్రగాడు పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడని సమాచారం.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన తేజ సజ్జా మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది.
Read Also:Karnataka: పోక్సో కేసులో మాజీ సీఎం యడ్యూరప్ప బెయిల్‌ను పొడిగించిన కర్ణాటక హైకోర్ట్