Teja Sajja : నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఏకలవ్య శిష్యుడిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. తెలుగు లో మొదటి సూపర్ హీరో కథగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా పోస్టర్స్,సాంగ్స్ మరియు ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్’. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.వినయ్ రాయ్ విలన్ గా నటించారు.వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రను పోషించారు. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించారు. అనుదీప్ దేవ్, హరిగౌడ మరియు కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టింది.దానిలో భాగంగా హనుమాన్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జనవరి 7) హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగింది. ఈ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ ఈవెంట్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.. మా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గారు రావడం సంతోషంగా వుంది. చిన్నప్పటి నుండి నేను ఆయనకు వీరాభిమానిని.. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. మా అమ్మ నాన్నల తరువాత నేను థాంక్స్ చెప్పుకునే వ్యక్తి చిరంజీవి గారు. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని అని తేజ సజ్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.. అలాగే హనుమాన్ మూవీ కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడినట్లు తెలిపాడు.. ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చేందుకు నిరంతరం శ్రమ పడినట్లు తేజ సజ్జా తెలియజేసారు.
Also Read
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
తాజావార్తలు
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!