Tej Pratap Yadav: పశ్చిమ బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనశక్తి జనతాదళ్..

  • సంచనల ప్రకటన చేసిన తేజ్ ప్రతాప్ యాదవ్
  • త్వరలో ఆన్‌లైన్ సభ్వత్వ డ్రైవ్ ఉంటుందని వెల్లడి
Tej Pratap Yadav

Tej Pratap Yadav

Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనశక్తి జనతాదళ్ అభ్యర్థులను నిలబెట్టనుందని శుక్రవారం వెల్లడించారు. తన పార్టీ జనశక్తి జనతాదళ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

READ ALSO: Komatireddy Venkat Reddy : ఇకపై సినిమా టికెట్‌ రేట్లు పెంచేది లేదు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అంతటా తమ పార్టీ సభ్యత్వ డ్రైవ్‌ను ప్రారంభించాలని నిర్ణయించిందని అన్నారు. వీలైనంత ఎక్కువ మందిని పార్టీకి కనెక్ట్ చేయడమే తమ లక్ష్యం అని వెల్లడించారు. పార్టీ ప్రస్తుతం సభ్యత్వ డ్రైవ్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆన్‌లైన్ సభ్యత్వ డ్రైవ్ కూడా ప్రారంభించనున్నట్లు, దీని గురించి మీడియాకు తెలియజేస్తామని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లోని పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ విషయానికి వస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఆర్జేడీ బహిష్కరిస్తే సొంత పార్టీ పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తేజ్ ప్రతాప్ యాదవ్ స్వయంగా మహువా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 51 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయాడు.

READ ALSO: Akhanda 2: ఆలస్యమైనా తగ్గని ‘అఖండ 2’ హవా: నార్త్ రెస్పాన్స్ సూపర్ క్రేజీ?