Site icon NTV Telugu

Tehsildar Ramanaiah Case: తహశీల్దార్ రమణయ్య హత్య కేసు.. చెన్నైలో నిందితుడు?

Tehsildar Ramanaiah Incident

Tehsildar Ramanaiah Incident

Tehsildar Ramanaiah Case: ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మమ్మరం చేశారు. చెన్నైలో నిందితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల ప్రత్యేక బృందం చెన్నైకి వెళ్లింది. హత్య జరిగిన మరుసటి రోజు 12 గంటల వరకు విశాఖలోనే నిందితుడు ఉన్నాడు. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి నిందితుడు పారిపోయినట్లు తెలిసింది.

Read Also: AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌ ఎప్పుడంటే?

నిందితుడు విమానాశ్రయంలో ఉండగా గుర్తించకపోవడంపై సీపీ రవి శంకర్‌ తీవ్రంగా మండిపడ్డారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యంపై జాయింట్ సీపీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ రమణయ్య హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు కొన్ని నిమిషాల ముందు భార్య వద్ద కీలక ఫైల్‌ను జాగ్రత్తగా ఉంచమని రమణయ్య చెప్పినట్లు విచారణలో తేలింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version