NTV Telugu Site icon

White House: జోబైడెన్‌ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్‌ హౌస్‌పై దాడి

White House

White House

White House: అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని భారత సంతతి యువకుడు చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాజీ జెండా ఉన్న ట్రక్కుతో వచ్చిన యువకుడు.. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్‌ పోలీసులు అతను లాఫాయోట్‌ పార్క్‌ వెలుపల ఉన్న బోలార్డ్‌లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు.

Read Also: Bengaluru Rains: బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం.. హైఅలర్ట్ ప్రకటించిన అధికార యంత్రాంగం

సాయివర్షిత్‌ను విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్‌ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్‌ డ్రైవింగ్‌, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు. సాయివర్షిత్‌పై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపటం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు..ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ కందుకూరు 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్‌ అయినట్లుగా గుర్తించారు. కానీ, యువకుడు ఈ చర్యకు పాల్పడటానికి కారణాలను మాత్రం పోలీసులు పేర్కొనలేదు. ఈ ఘటన తర్వాత సమీపంలో హోటల్‌లోని కొంతమంది అతిథులను అక్కడ నుంచి ఖాళీ చేయమని అధికారులు ఆదేశించినట్టు స్థానిక మీడియా నివేదించింది.

Show comments