NTV Telugu Site icon

Teegala Krishna Reddy: బీఆర్‌ఎస్‌కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా..

Teegala Krishna Redy

Teegala Krishna Redy

లోక్ సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా.. బీఆర్‌ఎస్‌కు మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు.

Read Also: BJP: తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ నెల 27న చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ఆమె సమక్షంలో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ సభలోనే ప్రియాంక సమక్షంలో తీగల ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి లైన్ క్లియర్ చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కాంగ్రెస్‌లో జాయినింగ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా, తీగల కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుండి పోటీ చేయాలని భావించారు.

Read Also: IND vs ENG: ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన భారత్.. ఇండియా టార్గెట్ ఎంతంటే.. ?

ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి దంపతులు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంస్థ తెలంగాణ ట్రేడర్స్‌ సెల్‌ అధ్యక్ష పదవికి కూడా శోభన్‌రెడ్డి రాజీనామా చేశారు.