ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలో ఒకటైన టెక్ మహీంద్రా తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. గురువారం నాడు వెల్లడించిన ఈ ఫలితాలలో గత ఏడాదితో పోలిస్తే టెక్ మహీంద్రా కంపెనీ నికరణ లాభంలో భారీగా క్షీణత కనబడింది. ఇందులో భాగంగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏకంగా 40 శాతం పైగా తగ్గడంతో రూ. 661 కొట్లుగా నమోదయింది. ఇకపోతే గత ఏడాది ఇదే త్రైమాసిక ఫలితాలలో కంపెనీ ఏకంగా రూ 1117.7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఆదాయం 6.2 శాతం తగ్గి రూ. 128071 కోట్లకు పరిమితమైంది.
Also Read: Covid-19: రెండేళ్లుగా ఒక వ్యక్తిలో కోవిడ్-19.. కొత్త వేరియంట్‌గా రూపాంతరం..
ఇక గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తంగా కంపెనీ ఏకీకృత నికర లాభం చూస్తే.. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 51.2% తగ్గుదల కనిపించింది. దీంతో ఏకీకృత నికర లాభం రూ. 2358 కోట్లకు చేరుకుంది. ఆదాయం 2.4% శాతం తగ్గి రూ. 51,996 కోట్లగా నమోదు అయ్యింది. గడిచిన త్రైమాసికలలో టెక్ మహీంద్రా తన కంపెనీలోని 795 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దాంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,45,445కు చేరుకుంది.
Also Read: Kenya Floods: కెన్యాను ముంచెత్తిన వరదలు.. 38 మంది మృతి..
నేడు కంపెనీ ఫలితాల నేపథ్యంలో షేర్ విలువ ఎన్‌ఎస్‌ఈలో 0.43% పెరిగి 1190.75 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ ఒక్కో షేరుపై 28 రూపాయల తుది డివిడెంట్ ఇవ్వాలని కంపెనీ బోర్డుకు సిఫారస్ చేసింది. ఇందుకుగాను పూర్తి ఆర్థిక సంవత్సరానికి డివిడెంట్ గా 5 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్ పై ఈ 28 రూపాయల తుది డివిడెంట్ ఇవ్వనున్నారు. గత ఏడాది నవంబర్లో కంపెనీ చెల్లించిన 12 రూపాయల మధ్యంతర డివిడెంట్ కు ఇది అదనం.