NTV Telugu Site icon

Tech Layoffs: ఇంటికే పరిమితమైన సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ల సంఖ్య లక్షన్నర. 2008 కన్నా ఈ ఏడాదే అధిక ‘టెక్‌’ లేఆఫ్స్

Tech Layoffs

Tech Layoffs

Tech Layoffs: 2022.. మరికొద్ది రోజుల్లో ముగుస్తోంది. కానీ.. ఈ సంవత్సరం ఇప్పటికే లక్షన్నర మంది ఉద్యోగ జీవితాలు తాత్కాలికంగా ముగిశాయి. మీరిక రేపటి నుంచి ఆఫీసుకి రావొద్దంటూ 965 టెక్‌ కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కి చెప్పేశాయి. 2008లో ప్రపంచ ఆర్థికమాంద్యం తలెత్తినప్పుడు కేవలం 65 వేల మందే కొలువులను కోల్పోగా 2009లో కూడా దాదాపు ఇదే సంఖ్యలో జాబులు పోయాయి. దీనికి రెట్టింపు కన్నా ఎక్కువగా ఈ ఏడాది లేఫ్‌లు ప్రకటించటం గమనించాల్సిన విషయం.

read also: India in World Steel Production: ఉక్కు ఉత్పత్తిలో.. ప్రపంచంలో..

ఛాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ అనే గ్లోబల్ ఔట్‌ప్లేస్‌మెంట్ అండ్‌ కెరీర్ ట్రాన్సిషనింగ్ సంస్థ ఈ డేటాను వెల్లడించింది. టెక్‌ కంపెనీలు.. వచ్చే ఏడాది మరియు ఆ తర్వాత కూడా మనుగడ సాగించాలనే వ్యూహంలో భాగంగానే లేఫ్‌లను అమలుచేస్తున్నాయని మార్కెట్‌వాచ్‌ అనే సంస్థ తన రిపోర్ట్‌లో తెలిపింది. లేఆఫ్స్‌ డాట్‌ ఎఫ్‌వైఐ అనే క్రౌడ్‌సోర్స్‌డ్‌ డేటాబేస్‌ సైతం ఉద్యోగుల తొలగింపుల లెక్కలను వెల్లడించింది. కొవిడ్‌-19 అనంతరం 14 వందల 95 టెక్‌ కంపెనీలు 2 లక్షల 46 వేల 267 మందిని నౌకరీల్లోంచి తీసేశాయని పేర్కొంది.

2022 ఇంతకన్నా ఘోరంగా ఉందని, ఇదే దుస్థితి 2023లోనూ కొనసాగుతుందని హెచ్చరించింది. నవంబర్‌ నెల మధ్య నాటికి అమెరికాలోని టెక్‌ సెక్టార్‌లో 73 వేల లేఆఫ్‌లు జరగ్గా ఇండియాలో 17 వేల మందికి పైగా సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌లను ఇంటికి పంపారు. సిబ్బందిని ఇలా అర్ధంతరంగా ఇబ్బందిపెట్టిన సంస్థల జాబితాలో మెటా, అమేజాన్‌, ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్‌, సేల్స్‌ఫోర్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, సిస్కో, రోకు, హెచ్‌పీ తదితర కంపెనీలున్న సంగతి తెలిసిందే. గూగుల్‌ కూడా ఈ లిస్టులో చేరబోతోందని వార్తలు వస్తున్నాయి.

Show comments