NTV Telugu Site icon

Virat Kohli : కోహ్లీకి చేరువలో మూడు రికార్డులు.. వన్డే సిరీస్ కి రెడీ.. ?

Kohli

Kohli

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకంతో చెలరేగింది. ఈ క్రమంలో ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఈ సిరీస్ లో అతడు కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. అదేంటంటే.. అహ్మదాబాద్ టెస్టులో మంచి ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న విరాట్.. వన్డే సిరీస్ లో కూడా అలాగే ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియా అత్యధికంగా ఈ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానంలో నిలుస్తాడు.

Also Read : Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో అందుకున్న అవార్డు.. ఆసీస్ పై కోహ్లీకి తొమ్మిదోది. ఇంకొక్క అవార్డును అతడు అందుకుంటే వివ్ రిచర్ట్స్, ఇయాన్ బోథమ్ తో సమానంగా పది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో రెండో స్థానంలో నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడూ ఆసీస్ పై ఏకంగా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.

Also Read : Record-Low Weddings: 30 దాటినా పెళ్లికి నో నో.. రికార్డు స్థాయిలో పడిపోయిన మ్యారేజ్‌లు..!

ఇకపోతే ఆస్ట్రేలియాపై చెలరేగిపోయే బ్లాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు.. అయితే జరగబోయే వన్డే సిరీస్ లో అతడు మరో సెంచరీ చేస్తే కంగారులపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డరకెక్కుతాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో బాదిన శతకం కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్ లో 75వది. వీటిలో 16 శతకాలు ఆసీస్ పై కొట్టినవే. ఇక వన్డేల్లో ఆసీస్ పై కోహ్లీ 8 సెంచరీలు చేశాడు. ఇక జరగబోయే ఈ మూడు వన్డేలలో ఒక్క సెంచరీ చేస్తే.. ఆసీస్ పై అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేస్తాడు. లేదంటే అధిగమించే అవకాశం ఉంటుంది.

Also Read : Acid Attack : టీ ఇవ్వలేదని భార్యపై యాసిడ్ పోసిన భర్త

ఇంకా ఆసీస్ తో జరగబోయే వన్డే సిరీస్ లో మరో మైలురాయిని కూడా విరాట్ కోహ్లీ చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి విరాట్ అతి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 262 వన్డే ఇన్నింగ్స్ ల్లో 12 వేల 809 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక తాజా సిరీస్ లో మరో 191 పరుగుల చేస్తే.. 13 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచే అవకాశం ఉంది.

Show comments