NTV Telugu Site icon

Team India: డేంజరస్ బ్యాటర్లను అధిగమించిన టీమిండియా యువ బ్యాటర్..

Abhishek Sharma Bat

Abhishek Sharma Bat

పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ 2024 రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్, రసిక్ సలామ్ అద్భుత బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 107 పరుగులకే ఆలౌటైన యూఏఈ.. అనంతరం లక్ష్య చేధనలో భారత్ 10.5 ఓవర్లలో 108 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించింది. భారత్ బ్యాటింగ్‌‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ అభిషేక్‌ శర్మ.. క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడు బ్యాటింగ్ చేశాడు. దీంతో.. అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు త్వరగా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. జట్టు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది. దీంతో.. దూకుడు ఇన్నింగ్స్‌తో అభిషేక్ ఆండ్రీ రస్సెల్, ట్రావిస్ హెడ్ వంటి డేంజరస్ బ్యాటర్లను అధిగమించాడు.

Read Also: Crime: దారుణం.. తన ఇద్దరు పిల్లల్ని చంపి మూడేళ్లు ఫ్రిజ్‌లో ఉంచిన తల్లి కథ..

ఆండ్రీ రస్సెల్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లు. అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసే విధానం, వారిద్దరి కంటే ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. యూఏఈపై ఈ ఇన్నింగ్స్ తర్వాత.. అభిషేక్ రస్సెల్, హెడ్ వంటి బ్యాట్స్‌మెన్‌లను అధిగమించాడు. తాజాగా.. అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అభిషేక్ నిలిచాడు. ఇప్పటివరకు అభిషేక్ 623 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 197.0 ఉంది. కాగా.. ఇప్పటివరకు 185.6 స్ట్రైక్ రేట్‌తో 1045 పరుగులు చేసిన ఆండ్రీ రస్సెల్ రెండవ స్థానానికి చేరుకున్నాడు. మూడో స్థానంలో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు టీ20ల్లో 182.1 స్ట్రైక్ రేట్‌తో 1442 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 177.1 స్ట్రైక్ రేట్‌తో 795 పరుగులు చేయగా.. జాక్ ఫ్రేజర్ 173.9 స్ట్రైక్ రేట్‌తో 668 పరుగులు చేశాడు.

Read Also: Venkaiah Naidu: నేటి యువత సిద్ధాంతపర రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..