Site icon NTV Telugu

Women’s World Cup Final: ఆటలో ఆధిపత్యం, పాటలో పరవశం – టీమిండియా విక్టరీ సాంగ్..!

Team India Women

Team India Women

Women’s World Cup Final: నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల క్రితం తాము ఒక ఈ పాటను రూపొందించామని అన్నారు. కానీ ప్రపంచ కప్ గెలిచిన రోజున దానిని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.

READ ALSO: Bigg Boss 9 : నువ్వు వెళ్లిపో.. తనూజపై భరణి ఫైర్.. తండ్రి, కూతుర్ల ఫైట్

ఎదురు చూపులకు ముగింపు..
జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. “మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు మాత్రమే మా జట్టు పాటను వెల్లడిస్తామని దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాము. ఈ రాత్రి రాత్రి దానిని నిజం చేస్తున్నాం” అని రోడ్రిగ్స్ అన్నారు. ఆమె మాట్లాడిన అనంతరం టీమిండియా క్రికెటర్లు, జట్టు సహాయక సిబ్బంది పాటను పాడటం ప్రారంభించారు.

Team India, Team India,

Karde sabki hawa tight,
Team India is here to fight.
Koi na leta humko light,
Our future is bright.
Chand pe chalenge, sath me uthenge,
Hum hai Team India, hum sath me jitenge.
Na lega koi panga, kar denge hum danga.
Rahega sabse upar, humara tiranga.
Hum hai Team India, hum hai Team India, hum hai Team India.

ఈ టోర్నమెంట్‌లో భారతదేశం తరపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిలో జెమిమా ఒకరు. ఏడు ఇన్నింగ్స్‌లలో 292 పరుగులు చేసి భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన మూడవ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. ఆమె సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. అది కూడా ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన తర్వాత ఆమె సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ నంబర్.3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో షఫాలి వర్మ, దీప్తి శర్మ తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా తరఫున అద్భుతంగా రాణించారు. షఫాలి 87, దీప్తి 58 పరుగులు చేయడంతో భారతదేశం 298/6 స్కోరు చేసింది. ఆ తర్వాత షఫాలి రెండు వికెట్లు, దీప్తి ఐదు వికెట్లు పడగొట్టింది దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసి 52 పరుగుల తేడాతో ప్రపంచ కప్‌ను గెలువడంలో కీలక పాత్ర పోషించారు.

READ ALSO: Pakistan: మునీర్ కోసం రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు..!

Exit mobile version