Site icon NTV Telugu

Sportsmanship: గెలిచినా ఒదిగే ఉన్న టీమిండియా మహిళలు.. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే ఇదేగా.. వీడియో వైరల్..!

Sportsmanship

Sportsmanship

Sportsmanship: క్రీడల్లో విజయంలో వినయం, ఓటమిలో సౌమ్యత ఉండాలనే నినాదాన్ని భారత మహిళల జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత అద్భుతంగా ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో తమ జట్టు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో భారత క్రీడాకారులు మునిగితేలుతుండగా.. ఓటమి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను చూసి భారత ప్లేయర్‌లు మానవత్వాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సంబరాలను పక్కన పెట్టి భారత క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా మరికొందరు కన్నీళ్లు ఆపుకోలేక ఏడుస్తున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Chevella Road Accident: మృత్యు ఘోష.. ప్రధాని దిగ్భ్రాంతి..! మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

వైరల్ అవుతున్న వీడియోలో మంధాన, జెమీమాలు దక్షిణాఫ్రికా క్రీడాకారిణులు మారిజాన్ కాప్, లారా వోల్వార్డ్ట్ ఇంకా ఇతర ఆటగాళ్లను ఓదారుస్తూ కనిపించారు. ఈ క్రీడా స్ఫూర్తికి క్రికెట్ రంగం నుండి మాత్రమే కాకుండా.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరగా చివరకు భారత్‌దే పైచేయి అయింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఓటమి పాలైనప్పటికీ దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ టోర్నమెంట్‌లో తమ జట్టు చూపించిన పోరాట స్ఫూర్తి గురించి గర్వంగా మాట్లాడింది.

Sudheer Babu: సుధీర్ బాబు అంటే ఎవరు?.. నిజం ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి!

మ్యాచ్ అనంతరం వోల్వార్డ్ట్ మాట్లాడుతూ.. “మేము ఆడిన ఈ టోర్నమెంట్ లో మా జట్టు గురించి నేను చాలా గర్వపడుతున్నాను. టోర్నమెంట్ అంతా అద్భుతంగా ఆడాం. కానీ, ఈరోజు భారత్ చేతిలో ఓడిపోయాం. ఓడిపోయినందుకు బాధగా ఉన్నా, దీని నుంచి ఖచ్చితంగా నేర్చుకుంటాం అని పేర్కొంది. టోర్నమెంట్‌లో ఎదురైన కష్టాల గురించి ప్రస్తావిస్తూ.. ఆస్ట్రేలియాపై తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన మ్యాచ్ లను వెనక్కి నెట్టి ముందుకు రావడంలో చాలా బాగా చేశాం. మేము చాలా బాగా ఆడటమో లేదా చాలా చెత్తగా ఆడటమో జరిగింది. కానీ బాగా ఆడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పింది. అలాగే కెప్టెన్సీ, బ్యాటింగ్‌ను సమన్వయం చేయడంపై స్పందిస్తూ.. ప్రపంచకప్‌కు ముందు నా అత్యుత్తమ ఏడాది ఇదేమీ కాదు.. టోర్నమెంట్ కూడా బాగా మొదలు కాలేదు. ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. ఇది క్రికెట్ ఆట మాత్రమే. ఈ రెండింటినీ వేరు చేయాలని ప్రయత్నించడం వల్ల నా సహజమైన ఆట ఆడటానికి స్వేచ్ఛ లభించింది. ఆ తర్వాత కెప్టెన్సీపై దృష్టి పెట్టానని ఆమె వివరించింది.

Exit mobile version