Site icon NTV Telugu

BCCI: డిసెంబర్‌లో సౌతాఫ్రికాకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ..!

Indvssf

Indvssf

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్ ఆడుతుంది. మరో నెల రోజుల పాటు అక్కడే ఉండి వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడుతుంది. ఆ తర్వాత డిసెంబర్‌లో సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరి వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాలో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్‌లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా ఆడుతుంది. 2021-22 సీజన్‌లో ఫ్రీడమ్ సిరీస్‌లో మూడు టెస్టులు జరిగాయి. అయితే ఈ సారి బిజీ షెడ్యూల్‌ని దృష్టిలో ఉంచుకుని.. ఓ టెస్టును తగ్గించింది.

Read Also: Pawan Kalyan: ఇప్పుడు జగ్గు భాయ్‌.. తర్వాత జగ్గు.. మీరు ఎంత నోరు జారితే అంత..!

ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగే ఫ్రీడమ్ సిరీస్‌కి మంచి క్రేజ్ ఉంది. రెండు అద్భుతమైన టెస్టు జట్ల మధ్య పోటీ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకున్న మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా పేరుతో ఈ సిరీస్ రూపొందించారు. బాక్సింగ్ డే టెస్టు, న్యూయర్ టెస్టు రెండూ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో కీలకమైనవిగా నిలిచాయి. అందుకే ప్రత్యేకంగా టీ20, వన్డే సిరీస్‌లు ముగిసిన తర్వాత టెస్టు సిరీస్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్నాడు.

Read Also: Chandini Tamilarasan: ఓమైగాడ్.. పొట్టి బట్టల్లో క్లీవేజ్ షోతో పాటు థైస్ ట్రీట్.. ఫొటోలు చూశారా?

డిసెంబర్ 10న డర్భన్‌లో తొలి టీ20 మ్యాచ్, డిసెంబర్ 12న గెబర్హాలో రెండో టీ20, జోహన్‌బర్గ్‌లో డిసెంబర్ 14న మూడో టీ20 మ్యాచులను భారత్-సౌతాఫ్రికా ఆడుతున్నాయి. అక్కడే డిసెంబర్ 17న మొదటి వన్డేను ఇండియాvsసౌతాఫ్రికా, డిసెంబర్ 19న గెబర్హాలో రెండో వన్డే, డిసెంబర్ 21న పర్ల్‌లో మూడో వన్డే ఆడతాయి.. అలాగే డిసెంబర్ 26న (బాక్సింగ్ డే టెస్టు) సెంచూరియన్‌లో తొలి టెస్టును ఇరు జట్లు ఆడనున్నాయి. రెండో టెస్ట్ మ్యాచ్ ను జనవరి 3న కేప్‌టౌన్‌లో ఆడనున్నాయి.

Exit mobile version