ఐపీఎల్ 2024లో భాగంగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో.. బంగ్లాదేశ్ ముందు 197 పరుగుల టార్గెట్ను పెట్టింది. టీమిండియా బ్యాటింగ్లో హార్ధిక్ పాండ్యా (50*) అర్ధసెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు శివం దూబే (34) మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. హార్ధిక్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.
Thandel : శ్రీకాకుళం షెడ్యూల్ పూర్తి చేసిన ‘తండేల్’.. ఫొటోస్ వైరల్
ఇక ముందుగా బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ (23), విరాట్ కోహ్లీ (37) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరి మధ్య 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొంది. ఆ తర్వాత.. రిషబ్ పంత్ (36) ఉన్నంత సేపు బౌండరీలు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ (6) పరుగులు చేసి ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. చివరగా అక్షర్ పటేల్ (3) పరుగులు చేశాడు. ఒక్క సూర్య మినహా అందరూ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు.
Gurugram: ఫైర్‌బాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..నలుగురు మృతి..
బంగ్లాదేశ్ బౌలర్లలో అందరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. తంజీమ్ హసన్ షకీబ్, రిషద్ హుస్సేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీశాడు. మరి బంగ్లా బాటర్లను టీమిండియా బౌలర్లు ఎలా కట్టడి చేయనున్నారు.. ఎంత స్కోరు వరకు కట్టడి చేయనున్నారో చూడాలి.