Team India Schedule: జింబాబ్వే సిరీస్ ముగిసింది.. టీమిండియా వాట్ నెక్స్ట్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Schedule: జింబాబ్వే పర్యటనను 3-0తో విజయవంతంగా ముగించిన టీమిండియా ఇప్పుడు తన తదుపరి అంతర్జాతీయ సిరీస్‌లకు సిద్ధమవుతోంది. ఆగస్టులో శ్రీలంక పర్యటనతో భారత జట్టు కొత్త సవాళ్లను ఎదుర్కోనుండగా.. సెప్టెంబర్ చివర్లో స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లతో వచ్చే 2 నెలలు టీమిండియా బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కోబోతోంది.
శ్రీలంక పర్యటన:
జింబాబ్వే సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా జరగనుంది. ఆపై రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ రెండు మ్యాచ్‌లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పరంగా కీలకంగా మారనున్నాయి.
Also Read
- Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
- IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
- Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
- Ramayana: ఆస్కార్ రేసులో 'రామాయణ: పార్ట్ 1'.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్:
శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ డీటెయిల్స్..
* సెప్టెంబర్ 27 – తొలి వన్డే – తిరువనంతపురం.
* సెప్టెంబర్ 30 – రెండో వన్డే – గువాహటి.
* అక్టోబర్ 3 – మూడో వన్డే – న్యూ చండీగఢ్
ఈ 3 వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ వన్డే మ్యాచ్‌లు పూర్తి కాగానే.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
టీ20 సిరీస్:
ఈ సిరీస్ అక్టోబర్ 6 నుంచి 17 వరకు కొనసాగుతుంది. టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా..
* అక్టోబర్ 6 – తొలి టీ20 – లక్నో.
* అక్టోబర్ 9 – రెండో టీ20 – రాంచీ.
* అక్టోబర్ 11 – మూడో టీ20 – ఇండోర్.
* అక్టోబర్ 14 – నాలుగో టీ20 – హైదరాబాద్.
* అక్టోబర్ 17 – ఐదో టీ20 – బెంగళూరు.
ఈ ఐదు మ్యాచ్‌లు కూడా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
-
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
-
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు