NTV Telugu Site icon

IND vs BAN: గ్వాలియర్ చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా.. (వీడియో)

T 20

T 20

భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ గ్వాలియర్‌లో జరుగనుంది. MPCA స్టేడియంలో ఎల్లుండి (6 అక్టోబర్ 2024) మ్యాచ్ జరుగనుంది. అందులో భాగంగా ఇరు జట్లు తొలి టీ20 కోసం గ్వాలియర్ చేరుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నెట్ సెషన్‌లో విపరీతంగా చెమటలు పట్టిస్తుంది. ఈ సందర్భంగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్‌లో కొన్ని టిప్స్ చెప్పాడు. క్యాచ్లు పట్టడం, త్రో చేయడం వంటివి ప్రాక్టీస్ చేశారు. కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో టి దిలీప్ ఆటగాళ్లకు ఫీల్డింగ్ టిప్స్ ఇస్తున్న వీడియోను షేర్ చేసింది.

AP Crime: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో లక్షలు పోయాయి.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం

బీసీసీఐ అప్‌లోడ్ చేసిన వీడియోలో.. గ్వాలియర్‌లో పూర్తి ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నట్లు బిసిసిఐ ట్వీట్ యొక్క శీర్షికలో రాసింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా తన ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. దిలీప్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాటే పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు తమ ‘త్రోయింగ్’ నైపుణ్యాలు, ‘అవుట్‌ఫీల్డ్ క్యాచింగ్’లను ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇతర యువ ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. గ్వాలియర్‌లో తొలి మ్యాచ్‌ అనంతరం తదుపరి రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, హైదరాబాద్‌లో జరగనున్నాయి.

ICC Women’s T20 World Cup: భారీ స్కోరు చేసిన న్యూజిలాండ్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

Show comments