NTV Telugu Site icon

Team India Practice: టీమిండియా కఠోర సాధన.. బాల్తో కాకుండా దానితో ప్రాక్టీస్

India

India

వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఇప్పటికే వెస్టిండీస్ లోని డొమినికా చేరుకున్న టీమిండియా.. జూలై 12 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసం రోజు టీం ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతున్నారు. అంతేకాకుండా వారు అనేక రకాల ఆక్టీవిటీస్ లో పాల్గొంటున్నారు. విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే సహా పలువురు ఆటగాళ్లు డిఫరెంట్ డ్రిల్ చేస్తున్న వీడియోను బీసీసీఐ సోమవారం పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డ్రిల్‌తో పాటు, టీమ్ ఇండియా తన ఫీల్డింగ్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేక కసరత్తులు చేసింది. ఇది క్యాచింగ్‌లో జట్టు ఆటగాళ్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందుకోసం టీమ్ ఇండియా రంగురంగుల్లో క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారని తెలిపింది.

Venu Yeldandi : స్టార్ హీరోతో సినిమా చేయాలనీ ఉంది అంటున్న వేణు..?

బీసీసీఐ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కొందరు ఆటగాళ్లు గ్రూపుగా ఏర్పడి రకరకాల కసరత్తులు చేస్తున్నారు. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్ ఈ గ్రూప్‌లో ఉన్నారు. ఈ ఆటగాళ్లపై రాహుల్ ద్రవిడ్ నిశితంగా గమనిస్తున్నాడు. ఈ ఆటగాళ్లందరూ కలర్‌ఫుల్ వస్తువును గాలిలోకి విసిరి దానిని ఒక చేత్తో పట్టుకుంటున్నారు. ఆటగాళ్లందరూ సరదాగా ఈ డ్రిల్ చేస్తున్నారు. డ్రిల్ పట్టుకోవడానికి కోహ్లీ రహానే వైపు విసిరాడు. దానిని అందుకోవడానికి ప్రయత్నించాగా.. కుదరలేదు. రహానేకి క్యాచ్‌కి అవకాశం రావడంతో.. ఒక కాలు వెనక్కి తీసుకుని, తర్వాతి కాలును ముందుకు లేపి క్యాచ్‌కు ప్రయత్నించాడు. కానీ అందుకోలేకపోయాడు. అతని క్యాచ్ పట్టకపోవడంపై కోహ్లీ మరియు ఇతర ఆటగాళ్లు నవ్వడం ప్రారంభించారు. టీమ్ ఇండియా ఆటగాళ్ల కళ్ళకు పదును పెట్టడానికి ఇలాంటి కసరత్తులు చేశారు. మరోవైపు టీమ్ ఇండియా స్లిప్ ఫీల్డింగ్ అంత బాగా లేదని, స్లిప్‌ల్లో క్యాచ్ పట్టుకోవడంలో ఈ డ్రిల్ ఆటగాళ్లకు మేలు చేస్తుంది.

Uddhav Thackeray: ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు..

టీమ్ ఇండియాకు చెందిన చాలా మంది ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో కనిపించారు. కానీ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్‌కు రాలేదు. ఇది జట్టు ఐశ్చిక శిక్షణ(Optional training) అని, అందుకే రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రాక్టీస్ చేసిన ఆటగాళ్లలో కోహ్లి, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రహానే ఉన్నారు. వీరు నెట్స్‌లో బ్యాటింగ్ చేయగా.. మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ ధీటుగా బౌలింగ్ చేశారు.